రామ రాజ్యం రాముని వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉంటుంది. నేటి పాలకుల ప్రకటనల వరకే పరిమితం చేసిన రామరాజ్యం ఎలా ఉండేది? సుభిక్షంగా, ధర్మానికి ప్రతీకగా సాగిన రామరాజ్యం సామాన్యుల స్వప్నమేనా? అంటే రాముని లక్షణాలు పునికిపుచ్చుకున్న నాయకులు వస్తారా? ఇది కోటి ఉషశ్సుల ప్రశ్న? అయితే రామరాజ్యం తెస్తామన్న పాలకులకు, కోరే ప్రజలకు సకలగుణాభిరాముని లక్షణాలు తెలుసుకోవాలి ..
శ్రీరామ చరిత్రలో రామరావణ సంగ్రామం ఒకెత్తు అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు. రామరావణ సంగ్రామం గురించి పలు సందర్భాల్లో తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి రామాయణం నుండి చెప్పుకొనే కథలు అనేకం. అయితే ప్రస్తుత కాలంలో రామరాజ్య ప్రస్తావన ఎంతో అవసరం
పితృ వాక్య పరిపాలకుడు, సకల గుణాభి రాముని 16 ఉత్తమ లక్షణాలు
- 1. క్రమశిక్షణ కలిగనవాడు.
- 2. వీరుడు, సాహసికుడు.
- 3. వేదాంతి.
- 4. కృతజ్ఞుడు.
- 5. సత్యవాక్కు పరిపాలకుడు.
- 6. గుణవంతుడు – అన్ని గుణాల్లోను ఉత్తముడు.
- 7. స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని.
- 8. సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.
- 9. అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు.
- 10. సమస్తకార్యాలలోను సమర్ధుడు.
- 11. మంచి లక్షణాలు కలిగిన అందగాడు.
- 12. అత్యంత ధైర్యవంతుడు.
- 13. క్రోధాన్ని జయించినవాడు. ప్రశాంతచిత్తుడు.
- 14. సమస్తలోకల్లోనూ తెలివైనవాడు.
- 15. అసూయ లేని వాడు.
- 16. దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి.
నాటి నుండి నేటి వరకు అనేకమంది పాలకులు రామరాజ్యం తెస్తాం, ఇస్తాం అంటూ ప్రకటనలు గుప్పించిన వారే. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మన జాతిపిత మహాత్మా గాంధి కూడా దేశం రామరాజ్యంలా సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన వారే.. కాని ఆదిశగా ఇంతవరకు ఎవరు అడుగులు వేయలేదు. ఎవరు అధికారంలో ఉంటే వారికి తోచిన విధంగా పాలన చేస్తూ ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదు. కనీసం ఈ శ్రీరామనవమి నుంచైనా రామరాజ్యం స్థాపనకు పాలకులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. . .!
